ఢిల్లీ : చిన్న స్థాయి నుంచి కన్స్ట్రక్షన్ రంగంలో అగ్రగామిగా ఎదిగిన మై హోమ్ గ్రూప్ అధినేత డాక్టర్ జూపల్లి రామేశ్వర్ రావు, ఆయన కుమారుడు, సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్మన్ జూపల్లి రామురావు ఈరోజు(నవంబర్ 7న) ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని స్నేహ పూర్వకంగా, మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ప్రధాని మోదీకి శాలువా కప్పి సత్కరించారు. కలియుగ దైవం వేంకటేశ్వర స్వామి విగ్రహాన్ని బహుమతిగా అందించారు.

 

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన లోతైన ఆధ్యాత్మిక విలువలు, దేశానికి సేవ చేయాలనే బలమైన నిబద్ధత వల్ల ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఆయన నాయకత్వ శైలి, ప్రజా సేవ పట్ల తనకున్న అంకితభావం అందరికీ తెలిసిందే. భారతదేశంలో సమానత్వాన్ని నెలకొల్పేందుకు మోదీ చేస్తున్న కృషి ఎనలేనిది. తనలో ఉన్న ఆ భావనకు నిదర్శనంగానే.. 2022లో హైదరాబాద్‌లో ‘స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ’ని ఆయన ప్రారంభించారు. శ్రీ రామానుజాచార్య గౌరవార్థం చిన జీయర్ స్వామి ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారన్న సంగతి తెలిసిందే.

మోదీ విలువలు, ఆయన ఆలోచనలు భారతదేశపు భవిష్యత్తు మహత్తరపూర్వకంగా తీర్చిదిద్దుతాయి. ఇది వ్యక్తిగత వినయం, ఇతరులను ఉద్ధరించాలనే కోరిక, కరుణ, సేవా సూత్రాల ద్వారా మార్గనిర్దేశం చేస్తాయి. ఇటీవల న్యూయార్క్‌లో జరిగిన ఒక చారిత్రాత్మక శిఖరాగ్ర సమావేశంలో ప్రసంగిస్తూ.. “మానవ కేంద్రీకృత విధానానికి” అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని మోదీ అన్న విషయం తెలిసిందే.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *